కాకినాడ రేవులో అద్భుతం! (Video)
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం బైరవపాలెం వద్ద సముద్రం లో రిలయన్స్ రిగ్ సమీపంలో అద్భుతం చోటు చేసుకుంది.
సముద్రంలో టోర్నడో ఏర్పడి సముద్రం నుండి ఆకాశంలోకి నీరు వెలుతున్న అద్భుత దృశ్యాన్ని స్థానిక మత్యకారులు చిత్రీకరించారు.
సముద్రంలో వేటకు వెళ్ళిన మత్యకారులకు టోర్నడో కనువిందు చేసింది.
సముద్రంలో ఈ టోర్నడో లు ఏర్పడిన్నపుడు స్థానిక మత్యకారులు వారి భాష లో ఆకాశం తొండంతో నీరు లాగేస్తుందని అంటూ వుంటారు.
ఇలాంటి టోర్నడోలను ఈమధ్య కాలంలో తాము చూడలేదని మత్యకారులు తెలిపారు.