మేము బిచ్చగాళ్లమా?
మీడియాఫైల్స్/హైదరాబాద్ : కేంద్రం దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వాలు అడుక్కుతినే సంస్థలుగా వున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. మేమేమైనా బిచ్చగాళ్లమా? అని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దశలవారీగా ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పట్ల కెసిఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ ప్యాకేజీ పచ్చి బోగస్, దగా, మోసం అంటూ విమర్శించారు. సోమవారంనాడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశ అనంతరం మీడియాతో మాట్లాడిన కెసిఆర్ కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. పన్నుల పెంచితేనే కేంద్రం డబ్బులు ఇస్తుందా అని వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటించిన విద్యుత్ సంస్కరణలను కూడా తాము అంగీకరించేది లేదని కెసిఆర్ స్పష్టం చేశారు.