ఇద్ద‌రు మావోయిస్టులు ఎన్‌కౌంట‌ర్‌

సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు
`ఇద్దరు మావోయిస్టులు మృతి
చింతూరు : ఆంధ్రా ఒడిస్సా బోర్డర్‌ పరిధిలోని సుక్మా జిల్లాలోని గోంపాడ్‌`కన్హాయిగూడ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్నా సమాచారంతో గోంపాడ్‌`కన్హాయిగూడ ప్రాంతంలో డిఆర్‌జి/సిఆర్‌పిఎఫ్‌ 217 బెటాలియన్‌ పోలీసులు జాయింట్‌ ఏరియా ఆపరేషన్‌ను మంగళవారం ఉదయం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో మావోయిస్టులకు, పోలీసు దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసు దళాలకు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. ఇద్దరు మృతదేహాలతోపాటు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్ధాలు, మావోయిస్టుల యొక్క ఇతర క్యాంపింగ్‌ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లభించిన మృతదేహాల్లో కొంటా ఏరియా కమాండర్‌ కవాసి హంగాగా ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో మరికొంత మంది మావోయిస్టులు గాయపడి ఉండవచ్చుననే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆ ప్రాంతం నుంచి పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్‌ను కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?