తెలంగాణ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా కేశ‌వ‌రావు, సురేశ్‌రెడ్డి

మీడియాఫైల్స్‌/హైదరాబాద్‌ : రాజ్య‌స‌భ ద్వైవార్షిక ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో తెలంగాణ‌లో ఉన్న రెండు ఖాళీల‌ను భ‌ర్తీ చేసే క్ర‌మం మొద‌లైంది. తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు గురువారం టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్‌ కె.కేశవరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్ రెడ్డి పేర్ల‌ను ఖరారు చేశారు. వారిద్దరు నామినేషన్‌లకు తుది రోజైన శుక్రవారం నామినేషన్‌లను దాఖలు చేయనున్నారు. కేశవరావుకు ఇది రెండోసారి, కాగా సురేశ్‌రెడ్డి తొలిసారిగా రాజ్య‌స‌భ‌లో అడుగుపెట్ట బోతున్నారు. కాగా, నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎంఎల్‌సి స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ అభ్యర్థిని ఖరారు చేయలేదు. తొలుత సురేశ్‌రెడ్డి పేరు వినిపించినప్పటికీ, ఆయన రాజ్యసభకే ఆసక్తి చూపడంతో సిఎం ఆయనను పెద్దల సభకే పంపాలని నిర్ణయించారు.

DO YOU LIKE THIS ARTICLE?