మెగాస్టార్ మూవీకి త్రిష గుడ్‌బై!
మీడియా ఫైల్స్ : మెగాస్టార్ చిరంజీవి మెగా ప్రాజెక్టు ఆచార్య మూవీకి మరో హీరోయిన్ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి కథానాయిక త్రిష తప్పుకొన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మాణంలో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో కథానాయికగా త్రిషను ఎంచుకున్నారు. అయితే ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్లు ఆమె శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. కొన్ని విషయాలు తొలుత చెప్పినట్లు, చర్చించుకున్నట్లు లేవు. అవి కాస్త భిన్నంగా వున్నట్లు అన్పించాయి. నా పాత్ర విషయంలో భిన్నాభిప్రాయాల వల్ల చిరంజీవి సర్ సినిమా నుంచి తప్పు కుంటున్నాను. చిత్ర బృందానికి నా అభినందనలు. తెలుగు ఆడియన్స్.. మరొక మంచి ప్రాజెక్టుతో మిమ్మల్ని త్వరలోనే కలుస్తానని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశారు. 2006లో చిరు-త్రిష కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు.