ధియేటర్లు బంద్‌….సినిమాలుండవ్‌!

మీడియా ఫైల్స్‌/హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్‌ పుణ్యమా అని ఈనెల 31వ తేదీ వరకు సినిమా ధియేటర్లను మూసివేయాలని కెసిఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ బాధితులే తప్ప మృతుల సంఖ్య లేకపోయినప్పటికీ, కరోనా వైరస్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ విస్తరించకుండా చూడాలని కెసిఆర్‌ ప్రభుత్వం గట్టినిర్ణయం తీసుకున్నది. ముందు జాగ్రత్త చర్యగా అన్ని స్కూళ్లు, షాపింగ్‌ మాల్స్‌, అలాగే సినిమా ధియేటర్లను మూసివేయాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. ఈనెల 31వ తేదీ వరకు ఈ మూసివేత కొనసాగుతుంది. ధియేటర్లు యజమానులు, సినీ నిర్మాతలు, ఇతర బాధ్యులు కూడా కరోనా ప్రభావంపై గత కొన్ని రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. చివరకు ధియేటర్లు మూసివేయాలని భావించారు.ఈ పదిహేను రోజులూ ధియేటర్లలో సినిమాలుండవు.

DO YOU LIKE THIS ARTICLE?