తెలంగాణలో 31 వరకు స్కూల్స్‌, మాల్స్‌ బంద్‌!

తెలంగాణలో కరోనా ఎఫెక్ట్‌!

మీడియా ఫైల్స్‌/హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్‌ గట్టిగా పడింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ బాధితులే తప్ప మృతుల సంఖ్య లేకపోయినప్పటికీ, కరోనా వైరస్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ విస్తరించకుండా చూడాలని కెసిఆర్‌ ప్రభుత్వం గట్టినిర్ణయం తీసుకున్నది. ముందు జాగ్రత్త చర్యగా అన్ని స్కూళ్లు, షాపింగ్‌ మాల్స్‌, అలాగే సినిమా ధియేటర్లను మూసివేయాలని నిర్ణయించింది. ఈనెల 31వ తేదీ వరకు ఈ మూసివేత కొనసాగుతుంది. అయితే షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు మాత్రం కొనసాగుతాయి.

DO YOU LIKE THIS ARTICLE?