తెలంగాణ‌లో మ‌రో 52 క‌రోనా పాజిటివ్‌లు

మీడియాఫైల్స్‌/హైద‌రాబాద్ : తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ కేసులు విజృంభిస్తున్నాయి. ఓవైపు కెసిఆర్ ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికీ, లాక్‌డౌన్‌ను కాద‌ని ప్ర‌జ‌ల్లో కొంద‌రు విచ్ఛ‌ల‌విడిగా తిర‌గ‌డంతో క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌లేక‌పోతున్నారు. మంగ‌ళ‌వారం కూడా భారీగా కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క‌రోజే 52 కొవిడ్‌-19 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 644కి చేరింది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 52 కేసులు న‌మోదుకాగా, ఒక‌రు మ‌ర‌ణించార‌ని, ఏడుగురు డిశ్చార్జి అయ్యార‌ని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన బులిటెన్ వెల్ల‌డించింది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 516 ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తంగా 110 మంది డిశ్చార్జి అయ్యారు. అలాగే మ‌ర‌ణాల సంఖ్య 18కి చేరింది. ఇదిలావుండ‌గా, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. ముఖ్యంగా హాట్‌స్పాట్ల‌లో ఎట్టిప‌రిస్థితుల్లో కేసులు పెర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క హైద‌రాబాద్‌లోనే అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోదైన విష‌యం తెల్సిందే. ఇప్ప‌టివ‌ర‌కు జిహెచ్ఎంసి ప‌రిథిలో 249 కేసులు న‌మోద‌య్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?