వ‌ల‌స కార్మికుల‌ను చేర్చే బాధ్య‌త రాష్ట్రాల‌దే!

మీడియాఫైల్స్‌/హైద‌రాబాద్ : కరోనా కట్టడి కోసం సర్కార్‌ లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడికక్కడ వలస
కార్మికులు చిక్కుకుపోయారని, వారిని సొంత రాష్ట్రాలకు పంపే గురుతర బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని హైకోర్టు గుర్తు చేసింది. సొంత రాష్ట్రాలకు
నడిచి వెళ్లే వలస కార్మికులకు గురించి వాస్తవ నివేదిక కోసం లాయర్‌
కె.పవన్‌కుమార్‌ను అడ్వకేట్‌ కమిషన్‌గా నియమిస్తున్నట్లు హైకోర్టు
ప్రకటించింది. నిత్యం మేడ్చల్‌ రోడ్డులో అయిదారు వందల మంది నడిచి
వెళుతున్నారని పిటిషనర్‌ లాయర్‌ చెబుతున్నారని, అయితే వలస కార్మికుల కోసం
రెండు వందల రైళ్లను నడిపామని, ఇప్పుడు బస్సులు కూడా జిల్లాల్లో
నడుస్తున్నాయని ప్రభుత్వం చెబుతున్నదని, ఈ ద్వంద్వ వాదనలో లేది నిజమే
తేల్చేందుకు అడ్వకేట్‌ కమిషన్‌న్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌
విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రకటించింది..
పవన్‌కుమార్‌కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రవాణా ఏర్పాటు చేయాలని, ఇతర
ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించింది. కమిషన్,
రంగారెడ్డి జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీని వెంట తీసుకుని
వలస కార్మికుల గురించి తెలుసుకుని వచ్చే నెల 1 నాటికి రిపోర్టు ఇవ్వాలని
కోరింది. ఉత్తరాదిరాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను రాష్ట్ర
సరిహద్దుల్లో వదిలేస్తున్నారని, రోజు మేడ్చల్‌ రోడ్డులో మండుటెండలో
ఎంతోమంది నడిచివెళతున్నారని, వారిని న్యాయం చేయాలని కోరుతూ రిటైర్డు
ప్రొఫెసర్‌ రమా శంకర్‌ నారాయణ మేల్కొటి వేసిన పిల్‌లో ఈ ఉత్తర్వులు
వెలువడ్డాయి. విచారణ జూన్‌ 2కి వాయిదా పడింది.

DO YOU LIKE THIS ARTICLE?