దేశ స్వాతంత్య్ర‌ చరిత్రలో ఏఐఎస్ఎఫ్ కు ఘనమైన చరిత్ర

★మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడండి  ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ వేడుకల్లో శ్రేణులకు పిలుపు★

హైద‌రాబాద్ : చరిత్రలో ఘనమైన చరిత్ర కలిగిన సంఘము ఏఐఎస్ఎఫ్ అని కొనియాడుతూ ఆ పోరాట స్పూర్తితో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు గావించాలని ఏఐఎస్ఎఫ్ శ్రేణులకు పోట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మాజీ ఉప కులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ పిలుపునిచ్చారు.
గురువారం నాడు హిమాయత్ నగర్ లోని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ సంఘం రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో  అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) 86వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ఆచార్య ఎస్వీ సత్యనారాయణ విచ్చేసి శ్వేతా అరుణాపతకాన్ని ఆవిష్కరించి, అనంతరం కేక్ కటుచేసి  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12న దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా ఏర్పాడి స్వాతంత్ర్య ఉద్యమంలో వీరొచిత పోరాటాలు చేసిన చరిత్ర ఉందని, స్వాతంత్ర్య అనంతరం సమాజంలో నాణ్యమైన విద్య, అసమానతలు లేని సమాజం ఉండాలని “చదువు-పోరాడు” అనే నినాదంతో ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు 85 సంవత్సరాలుగా విద్యార్థుల శ్రేయస్సు కోసం అనేక ఉద్యమాలు చేసిందని, ఏఐఎస్ఎఫ్ గతంలో చేసిన పోరాట స్పూర్తితో భవిష్యత్ పోరాటాలకు విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దానిలో భాగంగా దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. విద్య ప్రైవేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన అన్నారు. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో చారిత్రక ఉద్యమం నడపాల్సిన బాధ్యత ఏఐఎస్ఎఫ్ పై ఉందని, అత్యంత ప్రమాదకరమైన మతాన్ని పాఠ్యపుస్తకాలలో  తీసుకురావడంపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులకు యన్ అశోక్ స్టాలిన్, రావి శివరామకృష్ణ, జాతీయ యూనివర్సిటీల కన్వీనర్ స్టాలిన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ, మారుపక అనిల్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ఎన్ శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్ట లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోళి హరికృష్ణ, గ్యార నరేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గ్యార క్రాంతి కుమార్, శ్రీమాన్, యు. ఉదయ్, ఓయూ నాయకులు క్రాంతి రాజ్, రహ్మన్, జిల్లా నాయకులు చైతన్య యాదవ్, రఘు, పి.శివ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?