రాఖి పండుగ చాలా గొప్పది : గూడ ఐలయ్య

భారతదేశంలో రక్షక బంధం రాఖి పండుగ చాలా గొప్పది

అన్నాచెల్లెల స్నేహానికి నిదర్శనం
మహిళా సాధికారిత రక్షణ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

కాంగ్రెస్ నాయకులు ఉద్యమ నేత గూడ ఐలయ్య

జగద్గిరిగుట్ట  : జగద్గిరిగుట్ట మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ క్యాంపు కార్యాలయంలో మహిళలు ఘనంగా రక్షక బంధం రాఖీ ఉత్సవాలను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ఉద్యమ నేత గూడ ఐలయ్య గారు మాట్లాడుతూ రాఖీ రక్షా బంధన్ కి భారతదేశంలో గొప్ప చరిత్ర ఉందని అన్నా చెల్లెలు అక్క అనుబంధాన్ని బలపడుతుందని అన్నారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై లైంగిక దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మహిళా రక్షణ కరువైందని అన్నారు మహిళలకు సాధికారిత రాజకీయ ఆర్థిక గుర్తింపు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంఅధికారంలోకి వస్తుందని మహిళలకు రాజ్యాధికారం సాధికారిత రక్షణ కాంగ్రెస్ పార్టీ కలిగిస్తుందని అన్నారు ఈ ఉత్సవాలలో మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ గూడ వరమ్మగారు రేవంత్ రెడ్డి యువసేన నాయకులు సాయి ప్రవీణ్ గౌడ్ గారు యువజన కాంగ్రెస్ నాయకులు కొండ మహేష్ గారు మహిళా నాయకులు సత్య లక్ష్మి గారు శ్రీ లత గారు కాంగ్రెస్ నాయకులు మురళి శ్యామ్ గారు తదితరులు పాల్గొని ఘనంగా రాఖీ ఉత్సవాలను జరుపుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?