ప్రైవేటు బస్సు దగ్థం
మీడియాఫైల్/సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఒక ప్రైవేటు బస్సు దగ్థమైన ఘటన కలకలం రేపింది. జిల్లాలోని రామచంద్రాపురంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అయితే ప్రయాణికులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నడిరోడ్డుపై ఒక్కసారిగా ఆరేంజ్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సమీపంలోకి రాగానే బస్సు ముందు భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులకు ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. డ్రైవరు బస్సును నిలిపేసి, ప్రయాణికులను కిందకు దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు దిగిన కాసేపటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.