గుళ్లు, గోపురాలు బంద్‌

తిరువనంతపురం : కరోనా దెబ్బకు దేవుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో మిన్నకుండిపోయినట్లుగా కన్పిస్తోంది. ఎందుకంటే దీని ప్రభావం చివరకు దేవాలయాలపై కూడా పడింది. వివిధ మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలను దాదాపుగా మూసివేశారు. తాజాగా శబరిమలలో ఈనెల 29 నుంచి జరగాల్సిన వార్షిక అయ్యప్ప ఉత్సవాలను జనం లేకుండానే నిర్వహించనున్నార. అది కూడా చెప్పలేమని అధికారులు అంటున్నారు. అప్పటికల్లా కరోనా మరింత విజృంభిస్తే ఈ ఉత్సవాలను రద్దు చేసే అవకాశం లేకపోలేదని చెపుతున్నారు. 10 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు ఏ ఒక్క భక్తుడినీ అనుమతించేది లేదని శబరిమల దేవాలయ అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో ఇప్పటికే ఆంక్షలు విధించగా, తెలంగాణలోని భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలను జనం లేకుండానే ముగించేయాలని నిర్ణయించారు. అలాగే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలోనూ ఆంక్షలు విధించారు. ఈ పదిహేను రోజులూ ఇక్కడకు భక్తులు వెళ్లే అవకాశం లేదు. వివిధ మసీదులు, చర్చిలను కూడా పాక్షికంగా మూసివేశారు.

DO YOU LIKE THIS ARTICLE?