కరోనాపై విజయానికి మోడీ సప్తసూత్రాలు
కరోనాపై విజయం సాధించడానికి ప్రతి పౌరుడు ఏడు సూత్రాలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. అవేమిటంటే,
1. వృద్ధులకు బాసటగా నిలవండి, వారి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోండి.
2. కరోనాపై పూర్తి సమాచారం అందించే ‘ఆరోగ్య సేతు’ యాప్ను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి.
3. కరోనాతో ఎక్కువగా నష్టపోయిన కూలీలు, పేదలకు చేయగలిగినంత మేరకు సాయం చేయండి.
4. కరోనా కట్టడికి ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులు, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందిని గౌరవించండి.
5. తోటి ఉద్యోగులకు అండగా నిలిచి, వారిలో ఉద్యోగ భద్రత పట్ల భయాన్ని పోగొట్టండి.
6. సామాజిక, భౌతికదూరం తప్పనిసరి, మాస్కులును విధిగా ధరించండి.
7. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోండి. ఆయుష్ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించండి