కేరళ మాదిరిగా తెలంగాణలో మొబైల్‌ ల్యాబ్స్ ఏర్పాటు చేయ‌లేరా?

హైదరాబాద్ : కేరళ మాదిరిగా తెలంగాణలో మొబైల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేసే అవకాశాలు
ఉన్నాయో లేవో చెప్పాలని రాష్ట్రాన్ని హైకోర్టు ఆదేశించింది. సూర్యాపేటలో
రాష్ట్రంలోనే ఎక్కువగా 83 కరోనా కేసులు వస్తే గత నెల 22 నుంచి పరీక్షలు
చేయడం ఆపేశారని వరుణ్‌ సంకినేని వేసిన పిల్‌ను సోమవారం ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌
విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ విచారించింది. పరీక్షలు చేయకుండానే
అన్ని జోన్లను గ్రీన్‌ జోన్లుగా ప్రకటిస్తున్నారని పిటిషనర్‌ లాయర్‌
పూజిత చెప్పారు. దీనిపై కల్పించుకున్న హైకోర్టు పరీక్షలు చేయకుండానే ఆయా
జిల్లాలోని రెడ్, ఇతర జోన్లను గ్రీన్‌ జోన్లుగా ఎలా ప్రకటిస్తున్నారో
చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తిరిగి లాయర్‌ వాదిస్తూ కరోనా
పరీక్షలు రాష్ట్రంలో 19278 మాత్రమే చేశారని, ఏపీలో ఏకంగా 1.49 లక్షల
పరీక్షలు చేశారని చెప్పారు, రోనా పరీక్షలు చేయకుండానే గ్రీన్‌ జోన్లుగా
ఎలా ప్రకటిస్తారు. రెడ్, ఆరెంజ్‌ జోన్లను ఏవిధంగా గ్రీన్‌ జోన్లుగా
ప్రకటించారు. సూర్యాపేటలో ఏప్రిల్‌ 22 తర్వాత పరీక్షలు చేశారో లేదో
చెప్పాలి. అసలు రాష్ట్రంలో ఉన్న పరీక్షల ల్యాబ్స్‌ ఎన్ని ఉన్నాయో వాటి
వివరాలు ఇవ్వండి… అని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణ ఈ
నెల 26కి వాయిదా పడింది.

DO YOU LIKE THIS ARTICLE?