మధ్యప్రదేశ్‌లో నేడు బలపరీక్ష
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ అసెంబ్లీలో జరగాల్సిన బలపరీక్షపై గురువారం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీని శుక్రవారం రోజు ప్రత్యేకంగా సమావేశపరిచి, బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్ ఎన్‌పి ప్రజాపతిని ఆదేశించింది. అయితే ఈ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5.00 గంటల కల్లా ముగించేయాలని కూడా గడువు విధించడం గమనార్హం. వీటితో పాటు బలపరీక్షనంతటినీ వీడియో తీయాలని, అలాగే ప్రత్యక్ష ప్రసారం చేయాలని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పీకర్‌కు సూచించింది.