కంటైన్‌మెంట్‌ ఏరియాలు త‌ప్ప అన్నీ గ్రీన్‌ జోన్లే

తెలంగాణ‌లో 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు
హైదరాబాద్‌లో సిటి బస్సులు త‌ప్ప జిల్లాల‌కు బ‌స్సులు
మిగ‌తా ఆంక్ష‌లు కొన‌సాగింపు ః కెసిఆర్ వెల్ల‌డి

మీడియాఫైల్స్‌/హైదరాబాద్‌: లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం విధానాన్నియ‌థాత‌థంగా అనుస‌రించాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. లాక్‌డౌన్‌ను ఈ నెల 29 నుండి 31 వరకు పొడిగిస్తూనే, కంటైన్‌మెంట్ ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల‌నూ గ్రీన్ జోన్లుగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ప్ర‌క‌టించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సిఎం కెసిఆర్‌ మీడియాకు వివరించారు. హైదరాబాద్‌ నగరం మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల దుకాణాలు ప్రారంభించవచ్చన్నారు. కంటైన్‌మెంట్‌ ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లో ఏదీ తెరువద్దని, జిహెచ్‌ంఎసి పరిధితో పాటు మిగతా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పద్దతిలో, సరి బేసి సంఖ్యలో దుకాణాలు తెరువచ్చన్నారు. ప్రజా రవాణాకు అనుమతిస్తున్నామని, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వంద శాతం యధావిధిగా కార్యాకాపాలు కొనసాగతాయన్నారు. ఉత్పత్తి సంస్థలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందన్నారు. సోమవారం తెల్లవారుజాము నుండి ఆర్‌టిసి బస్సులను అనుమతిస్తున్నట్టు సిఎం చెప్పారు. ఇతర రాష్ట్రాల బస్సులు తెలంగాణ రాష్ట్రానికి అనుమతించబోమని, టిఎస్‌ఆర్‌టిసి బస్సులను ఇతర రాష్ట్రాలకు నడపబోమని సిఎం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సిటీ బస్సులు నడపబోమని చెప్పారు. ఆర్‌టిసి బస్సులలో కూడా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తారన్నారు. ఆటోలు, ట్యాక్సీలు అనుమతినిస్తారని, ఆటో, ట్యాక్సీలో నిబంధనలు పాటించాలని, లేదం పోలీసులు జరిమానా విధిస్తారన్నారు. సెలూన్‌ షాపులు, ఈ కామర్స్‌ వంద శాతం అనుమతి ఉంటుందన్నారు.
మతాలు ప్రార్థన మందిరాలు, మతపరమైన ఉత్సవాలపై నిషేధం ఉంటుందన్నారు. ఫంక్షన్‌ హాల్స్‌, సినామా హాల్స్‌ మాల్స్‌, సభలు, ర్యాలీలు, సమావేశాలు, విద్యాసంస్థలు, బార్లు, క్లబ్బులు, పబ్బులు, స్పోర్ట్‌, స్విమ్మింగ్‌ ఫ్లుల్స్‌, పార్కులు, జిమ్ములు, మెట్రో రైల్‌ సేవలు ఇంతకు ముందు మాదిరిగానే మూసి ఉంటాయని సిఎం వివరించారు. మాస్కులు తప్పనిసరిగా బంద్‌ పాటించాలన్నారు. వ్యక్తిగత శానిటైజ్‌ చేసుకోవాలని సూచించారు. వినియోగదారులు కూడా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని చెప్పారు. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని, అవసరం లేని వారు బయటకు వచ్చి హంగా సృష్టించవద్దని, లేదం తిరిగి పూర్తిగా లాక్‌డౌన్‌ను పాటించాల్సి ఉంటుందని సిఎం హెచ్చరించారు. 65 సంవత్సరాలు దాటిన వారు ఎక్కడపడితే అక్కడ తిరుగొద్దని, వారిని కాపాడుకోవాలని కెసిఆర్‌ కోరారు. ఇప్పటి వరకు నిబంధనలు పాటించి ప్రజలు సహకరించారని, ఫలితంగానే కరోనాను బాగానే నియంత్రించామని, ఇబ్బందులు రాలేదని, ఇలాగే కొనసాగితే తక్కువ కాలంలోనే కరోనా ప్రమాదం నుంచి బయటపడతామని సిఎం అన్నారు. ప్రభావితమైన ఏరియాలు, దాని పరిసరాలు 1452 కుటుంబాలు కంటైన్‌మెంట్‌ ఏరియాలో ఉన్నాయని, కంటైన్‌మెంట్‌ ఏరియాలో పోలీసు పహార ఉంటుందని, వీరికి అన్ని ఏర్పాట్లు చేస్తామని, వారికి ఆహార సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. నగర ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించామని, మరో గత్యతరం లేదని, అందరి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించామన్నారు. ప్రపంచం మొత్తం వైద్య శాస్త్రవేత్తలు, నిపుణులు రేపో, మాపో వచ్చే పరిస్థితి తెలియదని, ఎన్ని మాసాలు ఉంటుందో ఖచ్చితంగాచెప్పే పరిస్థితి లేదన్నారు. కరోనాతో కలిసి జీవించే పరిస్థితి నేర్చుకోవాలని చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?