ఇంటర్నెట్ పేజీలన్నింటినీ ప్రింట్ తీస్తే ఎన్ని పేపర్లు కావాలో తెలుసా?
లండన్ : మనం ఇంటర్నెట్లో చాలా వెబ్సైట్లు చూస్తూవుంటాం. అవసరమైన సబ్జెక్టులను ప్రింట్లు తీసుకుంటూవుంటాం. అయితే ఇంటర్నెట్లో వుండే అన్ని వెబ్సైట్లు, పోర్టల్స్, ఈ పేపర్స్‌లో వుండే మొత్తం సబ్జెక్టున్నింటినీ ఒక పేజీ వదలకుండా ప్రింట్లు ఇవ్వగలమా? అలా ఇంటర్నెట్ మొత్తాన్ని ప్రింట్ ఇవ్వాలంటే ఎన్ని షీట్ల పేపర్లు కావాలో తెలుసా? ఏకంగా 136 బిలియన్ పేపరు షీట్లు కావాలంట! అంటే 13,600 కోట్ల వైట్పేపరు షీట్లు వుంటే తప్ప యావత్ ఇంటర్నెట్ మొత్తాన్ని ప్రింట్ తీయలేము. ఇంటర్నెట్ మొత్తాన్ని ప్రింట్ ఇవ్వాలంటే 8/11 సైజు స్టాండర్ పేపరు షీట్లు 136 బిలియన్లు అవసరమవుతాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు లెక్కకట్టారు. బ్రిటన్‌లో లీస్టర్ యూనివర్శిటీకి చెందిన జార్జి హార్వుడ్, ఇవాంజలిన్ వాకర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఇంటర్నెట్ ప్రింట్లుపై పరిశోధన జరిపారు. ఉదాహరణకు వికీపీడియా ఇంగ్లీషు వెర్షన్‌ను తీసుకుంటే…వికీ పీడియా ఆర్టికల్స్ 47,23,991 వెబ్ పేజీల్లో వున్నాయట! వాటిని ప్రింట్లు ఇవ్వాలంటే దాదాపు 7,08,59,865 పేపరు షీట్లు అవసరమవుతాయన్నమాట! ఆ రకంగా ఇంటర్నెట్ మొత్తాని ప్రింట్లు ఇవ్వాలంటే 13,600 కోట్ల పేపరు షీట్లు కావాలన్నమాట!