ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత?

మీడియా ఫైల్స్‌/హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నట్లు సమాచారం. నిజామాబాద్‌ స్థానిక సంస్థల కేటగిరీలో ఖాళీగా వున్న స్థానం నుంచి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా కవిత పోటీ చేస్తున్నట్లు అభిజ్ఞవర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు టిఆర్‌ఎస్‌ బుధవారంనాడు అధికారికంగా ఒక ప్రకటన చేయవచ్చని తెలిసింది. గురువారంనాటితో ఈ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ముగియనున్నందున, కవిత బుధవారమే నామినేషన్‌ వేయవచ్చని సమాచారం. అంతేగాకుండా, ఆమె ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే టిఆర్‌ఎస్‌ క్యాబినెట్‌లో స్థానం పొందుతారని ట్విటర్‌లో నిజామాబాద్‌కు చెందిన ఓ నాయకుడు పేర్కొన్నారు. ఈ విషయం ఇప్పటికే సోషల్‌మీడయాలో హల్‌చల్‌ చేస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?