ఇండియాలో తొలి కరోనా మృతి
బెంగళూరు : కరోనా వైరస్ ఇండియాను కకావికలం చేస్తోంది. ఇప్పటివరకు అనుమానిత కేసులు మాత్రమే నమోదయ్యాయి. తాజాగా మృతులు మొదలయ్యాయి. కరోనా వైరస్ కారణంగా భారత్‌లో తొలి మృతి కేసు నమోదైంది. కర్నాటకలోని కల్బుర్గిలో బుధవారం చనిపోయిన 76 ఏళ్ల వృద్ధుడు మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ కరోనా వైరస్‌తోనే చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలతో సౌదీ నుంచి వచ్చిన ఈ వృద్ధుడు ఇటీవల ఓ ఆస్పత్రిలో చేరారు. అతడి నమూనాలను వైద్య పరీక్షల కోసం పుణేకు పంపగా రిపోర్డులో పాజిటివ్అని తేలింది. అంతకు ముందు తెలంగాణలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోనూ అతడు చికిత్స పొందినట్లు తెలిసింది. దీంతో వృద్ధుడి మృతిపై తెలంగాణ ప్రభుత్వానికి కర్నా టక ఆరోగ్యశాఖ సమాచారం అందించింది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ఇప్పటివరకు 125 దేశాలకు పాకింది. మొత్తం 1,32,983 మంది కరోనా బారిన పడగా.. ఇప్పటివరకు 4,946 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ను తొలుత గుర్తించిన చైనాలోనే 3,196 మంది మృతి చెందారు. ఇటలీలోనూ దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తాజాగా 13 కేసులు నమోదుకావడంతో దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య73కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. దేశంలో 17 మంది విదేశీయులు సహా మొత్తం 73 మంది కరోనావ్యాధిగ్రస్తులున్నారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.