జర్నలిస్టుల సేవలు మరువలేనివి
మీడియాఫైల్స్/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న సమయంలో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు
మరువలేనివని హైకోర్టు వ్యాఖ్యానించింది. జర్నలిస్టులను ప్రభుత్వం
ఆదుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ న్యాయవాది ఆర్.భాస్కర్ వేసిన పిల్‌ను
చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం
విచారించింది. లాక్డౌన్ వేళ జర్నలిస్టులు కష్టాలు పడుతున్నారని, వారికి
ఆర్థిక సాయం చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన
బెంచ్.. ఈ మేరకు జర్నలిస్టులు ప్రభుత్వానికి 2 వారాల్లోగా వినతిపత్రం
సమర్పించుకోవాలని, దానిపై ప్రభుత్వం తగిన రీతిలో స్పందించాలని
ఉత్తర్వులిచ్చి పిల్‌పై విచారణను ముగించింది.