బయటకు రావద్దు…ప్లీజ్‌!

రేపు జనతా కర్ఫ్యూ!

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు, ఒక్కరోజైనా ప్రజలంతా సామాజిక దూరం పాటించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారంనాడు జనతా కర్ఫ్యూ జరగనున్నది. ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే చేస్తున్న జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇదివరకే పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. ప్రజలంతా బయటకు రాకుండా ఇంట్లోనే వుంటూ సెల్ఫ్‌ క్వారెంటయిన్‌గా భావిస్తూ కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలన్నది ఈ జనతా కర్ఫ్యూ ఉద్దేశం. సాయంత్రం 5 గంటలకు అందరూ తమ ఇళ్ల నుంచి పోర్టిగోల్లోకి వచ్చి, చప్పట్లు కొట్టడం ద్వారా ఒకరిని ఒకరు సంఘీభావం చెప్పుకుంటూ, కరోనా అదుపునకు కృషి చేస్తున్న వైద్యులకు సంఘీభావం తెలియజేయాలన్నది కూడా ఈ జనతా కర్ఫ్యూలో భాగమే. సో…మా వెబ్‌సైట్‌ ఫాలోవర్లు, ప్రజలు ఈ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని మీడియాఫైల్స్‌ న్యూస్‌ ఏజెన్సీ విజ్ఞప్తి చేస్తున్నది.

DO YOU LIKE THIS ARTICLE?