ఐపిఎల్‌ వాయిదా

ముంబయి : క్రికెట్‌ అభిమానులకు పండుగతో సమానమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) ఈ సారి వాయిదా పడింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రజలు గుమిగూడి వుండకుండా చూడాలని ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో ఇప్పటికే క్రికెట్‌ టోర్నమెంట్లు రద్దవుతూ వచ్చాయి. ఇందులో భాగంగా ఐపిఎల్‌ను కూడా రద్దు చేయకుండా కొన్ని రోజులపాటు వాయిదా వేయాలని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మార్చి 29వ తేదీ నుంచి జరగాల్సిన ఐపిఎల్‌ను ఏప్రిల్‌ 15వ తేదీ వరకు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుపుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రకంగానే ఖాళీ స్టేడియాల్లోనే ఐపిఎల్‌ నిర్వహించాలని మొదట్లో భావించారు. అందుకు ఫ్రాంఛైజీలు కూడా అంగీకరించాయి. కానీ జనం లేని క్రికెట్‌ కిక్‌ ఇవ్వదని అందరికీ తెల్సిందే. అయితే కరోనా ప్రభావం త్వరలోనే తగ్గుతుందన్న ఆశాభావంతో కొన్ని రోజులపాటు వాయిదా వేయాలని బిసిసిఐ నిర్ణయించింది. పైగా విదేశీ ఆటగాళ్ల వీసాలపై కూడా వచ్చేనెల 15 వరకు నిషేధం ఉన్న విషయం తెల్సిందే.

DO YOU LIKE THIS ARTICLE?