భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దు
న్యూఢిల్లీ : భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయింది. ఇది మూడు వన్డేల సిరీస్. ధర్మశాలలో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక తదుపరి రెండు వన్డేలు లక్నో, కోల్‌కతాల్లో జరగాల్సి వున్నాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఐపిఎల్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని నిమిషాలకే భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణాఫ్రికా జట్టు లక్నో నుంచి నేరుగా ఢిల్లీ చేరుకొని వారి స్వదేశానికి పయనమవుతుందని బిసిసిఐ వివరించింది. ఈ సిరీస్ రద్దుకు దక్షిణాఫ్రికా బోర్డు కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.