తొలి వన్డే రద్దు
ధర్మశాల : వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ రద్దయింది. వర్ష సూచన ముందు రోజే కన్పించింది. అయినప్పటికీ ఏర్పాట్లు చేశారు. అయితే గురువారం ఉదయం నుంచే వర్షం పడటంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాదని అంపైర్లు తేల్చి చెప్పారు. పైగా ధర్మశాల స్టేడియం పూర్తిగా నీటితో నిండిపోయింది.