క్వారంటైన్ వ‌స‌తుల‌పై హైకోర్టులో పిల్‌

మీడియాఫైల్స్‌/హైద‌రాబాద్ : ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చేవారి కోసం అన్ని వసతులతో కూడిన కోరం టైన్ లో సదుపాయాలు కల్పించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్రంలోకి బయట వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్లకోసం కోరం టైన్ లో సదుపాయాలతో పాటు వారికి వైద్యం అందించే సిబ్బందికి వ్యక్తిగత వైద్య రక్షణ పరికరాలు అందజేసేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రొఫెసర్ పి యల్ విశ్వేశ్వర రావు పిల్ దాఖలు చేశారు. అనాధలు, వీధి బాలలు యాచకులు వలస కార్మికులకు భోజన వసతి సదుపాయాలు కల్పించే ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెల్ల రేషన్ కార్డు లేని వారికి చౌక దుకాణాల ద్వారా నిత్యవసర వస్తువులను అందజేయాలన్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో జైళ్ళలో ఉన్న ఖైదీలు, విచారణలోని ఖైదీలకు రక్షణ కోసం సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలు రాష్ట్రంలో అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రాష్ట్రంలో అమలు చేయడం లేదని పేర్కొంటూ ప్రొఫెసర్ హరగోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కమిటీ వేయాలని చెప్పిందని సుప్రీంకోర్టు అండర్ ట్రయల్ ఖైదీలు కోసం రివ్యూ కమిటీ వేయాలని గైడ్ లైన్స్ జారీ చేసిందని, అయితే అవి అమలు కావడం లేదని ఆయన పిల్ ద్వారా హైకోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలోని సెంట్రల్ జైలు సబ్ జైలు ఓపెన్ జైలు మొదలైన వాటిలో సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరారు చిన్నపాటి నేరాలకు పాల్పడిన ఖైదీలను ముఖ్యంగా విచారణ ఖైదీలు సమాజాన్ని ప్రమాదం లేని ఖైదీలను సామాజిక ఉద్యమాల్లో పాల్గొని ఖైదీలను విడుదల చేయడం ద్వారా వైరస్ను అరికట్టేందుకు వీలు ఉంటుందని ఆయన రిట్ లో పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?