భాగ్యనగరం జలమయం
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం వర్షం కుండపోతగా కురిసింది. ఊహించనిస్థాయిలో వర్షం పడటంతో నగరంలోని దాదాపు రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. ఫలితంగా ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించింది. లాక్డౌన్ తర్వాత ఈ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోవడం ఇదే మొదటిసారి. గండిపేట, ఖైరతాబాద్, నాంపల్లి, చార్మినార్, మొయినాబాద్, సరూర్‌నగర్, సికింద్రాబాద్, దిల్‌సుక్‌నగర్, ఎల్బినగర్ తదితర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. బషీర్‌బాగ్ ఫ్లుఓవర్‌పై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేయకపోవడంతో ఎనిమిది గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. రాత్రి 12 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూనే వున్నారు. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. జిహెచ్ఎంసి సిబ్బంది రంగంలోకి దిగి చెత్తను తొలగించి నీరు నిలిచిపోకుండా ప్రయత్నాలు చేశారు.