నిర్మల్‌లో కరోనా టెస్ట్‌లపై రిపోర్టు ఏంటి?
హైదరాబాద్ : నిర్మల్ జిల్లాలో గత ఏప్రిల్ 22 నుంచి ఇప్పటి వరకూ చేసిన కరోనా
టెస్ట్‌ల గురించి రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
మహారాష్ట్ర నుంచి వలస కార్మికులు వస్తున్నందున, వలస కార్మికుల కోసం
ప్రభుత్వాలు రైళుల బస్సులు వేసినందున వలస వచ్చిన వారికి కరోనా పరీక్షలు
చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సూచన చేసింది, కరోనా పరీక్షల నివేదిక అందిన
తర్వాత ఈ నెల 26న తదుపరి విచారణ చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల
డివిజన్‌బెంచ్ ప్రకటించింది నిర్మల్‌కు. వలస కార్మికులు వస్తున్నారని,
ప్రధానంగా మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో నిర్మల్ జిల్లాకు
వచ్చారని,కరోనా పరీక్షలు నిర్వహించకపోతే కరోనా వైరస్ వ్యాప్తి అవుతుందని
న్యాయవాది చిన్నోళ్ల నరేష్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. మార్కెట్లలో
భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, కరోనా లక్షణాలు ఉన్న వారికి
పరీక్షలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.