పిజి మెడిక‌ల్ ఫీజుల పెంపు పిటిష‌న్ల‌పై విచార‌ణ ఉండ‌దిక‌!

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని అన్‌ ఎయిడెడ్‌ నాన్‌ మైనారిటీ మెడికల్, డెంటల్‌ కాలేజీల్లో
పీజీ మెడికల్‌ ఫీజుల్ని పెంపుదలను సవాల్‌ చేసిన వ్యాజ్యాలను
విచారించకూడదని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌
కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది. మరో ధర్మాసనం విచారణ
చేసేలా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రధాన న్యాయమూర్తిని కోరింది.
ఈమేరకు రిట్లను సీజే ఎదుట నివేదించాలని రిజిస్ట్రీని ధర్మాసనం
ఆదేశించింది.  ఫీజుల పెంపు జీవో 20ని సవాల్‌ చేస్తూ సుదీప్‌శర్మ మరో 121
మంది హైకోర్టును ఆశ్రయించిన తర్వాత జస్టిస్‌ ఎం.ఎస్‌. రామచంద్రరావు
ధర్మాసనం విచారణ చేయకూడదంటూ  తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ
(టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ పి.స్వరూప్‌రెడ్డి మెమో దాఖలు
చేయడంపై ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. ఈ మెమోపై ధర్మాసనం సోమవారం
ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘మెమో దాఖలు చేయడం కోర్టు ధిక్కారం కిందకు
వస్తుందని, అయినప్పటికీ తాము ఆ విషయంలోకి వెళ్లడం లేదని ధర్మాసనం
పేర్కొంది. ఏవిధంగా తాము విచారణ చేయకూడదని స్వరూప్‌రెడ్డి చెబుతున్నారో
అర్ధం కావడం లేదని, ఇలా చేయడంఓ కోర్టు విధుల్లో జోక్యం చేసుకోవడమే
అవుతుందని పేర్కొంది. నేరపూరితంగా మెమో వేశారని ఆక్షేపించింది. కోర్టుల
కేసుల పట్ల, న్యాయ ప్రక్రియ పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధి న్యాయవాదులకే
కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు కూడా తెలుసునని స్పష్టం చేసింది.
కావాలనే స్వరూప్‌రెడ్డి మెమో వేసి కోర్టు ప్రక్రియలో జోక్యం
చేసుకున్నారని, ఇది దురుద్దేశంతోనే చేశారని, న్యాయ ప్రతిష్టను కాపాడే
చర్యల్లో భాగంగా మెమో విషయంలో జోక్యం చేసుకోకుండా రిట్‌ పిటిషన్లను తాము
విచారిం^è కూడదు..’’ అని నిర్ణయించామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదిలా
ఉండగా ఆ రిట్లపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం
విచారించనుంది.

DO YOU LIKE THIS ARTICLE?