వాహ‌న‌దారుల‌కు సూప‌ర్‌గుడ్‌న్యూస్‌!

వాహ‌న‌దారుల‌కు సూప‌ర్‌గుడ్‌న్యూస్‌!
ఏ రాష్ట్రానికి వెళ్లినా…రీ రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేదు
కేంద్ర ప్ర‌భుత్వం నూత‌న నోటిఫికేష‌న్ జారీ

న్యూఢిల్లీ : వాహ‌న‌దారుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం సూప‌ర్ గుడ్ న్యూస్ చెప్పింది. వాహన రిజిస్ట్రేషన్ ను ఏ రాష్ట్రంలో చేసినా ఇక నుంచి ఎలాంటి స‌మ‌స్య రాదు, రాబోదు. ఆ వాహ‌నాన్ని ఏ ఇత‌ర రాష్ట్రానికి తీసుకుపోయినా కొత్త‌గా తిరిగి రిజిస్ట్రేష‌న్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఈ విష‌యాన్ని కేంద్రం క్లియ‌ర్‌క‌ట్‌గా చెప్పింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తమ వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించాల్సిన అవసరం లేకుండా ‘బీహెచ్‌’ (భారత్‌ రిజిస్ట్రేషన్‌) రిజిస్ట్రేషన్‌ సిరీస్‌ను కేంద్రం తీసుకు వ‌చ్చింది. ఈ విధానం కింద వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసే అవసరం ఉండ‌నే ఉండ‌దు. ఈ మేరకు తాజాగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చేయించిన వాహనాన్ని గరిష్ఠంగా 12 నెలల వరకు మాత్రమే వేరే రాష్ట్రంలో ఉపయోగించే వీలుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ కాలం పాటు అక్కడ వాహనం నడపాలంటే వాహనాన్ని ఆ గడువులోగా మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించాల్సి వుంటుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న విధాన‌మిది. దీనివ‌ల్ల‌ చాలామంది ఉద్యోగులకు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. ఈ బాధ‌ల‌నుంచి విముక్తి క‌లిగించేలా కేంద్రం బీహెచ్‌ సిరీస్‌ను తీసుకొచ్చింది. కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు (ఆయా కంపెనీలు నాలుగు రాష్ట్రాల్లో సేవలందిస్తుండాలి) ఈ రిజిస్ట్రేషన్‌ సదుపాయాన్ని స్వచ్ఛందంగా ఉపయోగించుకోవచ్చని కేంద్రం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా సులువుగా వెళ్లేందుకు వీలుపడుతుంది.

DO YOU LIKE THIS ARTICLE?