పంటల్లో కొత్త సేద్యం…జీన్‌ ఎడిటింగ్‌

ఆధునిక వ్యవసాయానికి వెన్నెముక ప్లాంట్‌ బ్రీడింగ్‌. వ్యవసాయం మొదలైన నాటి నుంచి కూడా అది పంట మెరుగు దలకు తోడ్పడింది. పంట మెరుగుదల ఆశయాలు కాలం గడిచే కొద్దీ వృద్ధి చెందుతూ వచ్చాయి. మెరుగైన రకాలను అం దించేందుకు ప్లాంట్‌ బ్రీడర్స్‌ అందుబాటులో ఉన్న సమాచారాన్ని మరియు ఉపకరణా లను ఉపయోగించుకున్నారు. బ్రీ డర్లు నేడు బహుముఖ సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. మారిపోతున్న పరిస్థితుల్లో అధిక దిగుబడులతో పాటుగా మెరు గుపర్చబడిన పోషక పదార్థాలు / ఉత్పత్తి, సుస్థిరదాయక సాగు / ఉత్పత్తి లాంటివి కూడా వీటిలో ఉన్నాయి. ప్లాంట్‌ బ్రీ డింగ్‌ సూత్రాలు అలాగే ఉన్నప్పటికీ, నేటి బ్రీడర్లు జీన్‌ సీక్వెన్స్‌ మరియు ఆగ్రోనామిక్‌ డేటా మరియు ఆధునిక మాలిక్యు లర్‌ టూల్స్‌ రూపంలో శాస్త్రీయ పరి జ్ఞానం కలిగిఉన్నారు. బ్రీడింగ్‌ కు ప్రాథమిక ఆవశ్యకత వేరియబుల్‌ ప్లాంట్‌ పా పులేషన్‌. వేరియబుల్‌ ట్రీట్స్‌ తో మొక్కలను జనరేట్‌ చేసేందుకు రసాయనాలు లేదా రేడియేషన్‌ ద్వారా విత్తనా లను శుద్ధి చేయడం ద్వారా ఇది సహజంగానే చోటు చేసుకుంటుంది లేదా జనరేట్‌ చేయబడుతుంది. ఈ ప్రక్రియ ను మ్యుటేషన్‌ బ్రీడింగ్‌ అని అంటారు. గోధుమ, వరి, బార్లీ, సజ్జ, జూట్‌, వేరుశనగ, శనగలు, పెసర్లు, మినుము లు, సన్‌ ఫ్లవర్‌, పత్తి, అరటి లాంటి వాటిని మెరుగుపరిచేందుకు దీన్ని ఉపయోగిస్తారు. మ్యుటాజె నిసెస్‌ కార ణంగా చోటు చేసుకున్న మార్పులు భారీగా మరియు నాటకీయంగ ఉండిఉండవచ్చు మరియు ఎక్స్‌ టెన్సివ్‌ సె లెక్షన్‌ అవసరమై ఉండవచ్చు. పంట వృద్ధి మరియు జన్యువుల గురించి లోతైన సమాచారం మరియు సాంకేతి క ఉపకరణాలు బ్రీడింగ్‌ లో సెలెక్షన్‌ ప్రక్రియలను సరళం చేసినా, బాగా సమయం పట్టే వివిధ ప్రాసెస్‌ మరియు జనరేషన్స్‌ ఇబ్బందులు మాత్రం అలానే ఉండిపోయాయి. పంటను బట్టి ఒక్కో మెరుగైన రకాన్ని వృద్ధి చేసేందు కు ఎంత లేదన్నా 7 నుంచి 13 ఏళ్ళ సమయం పడుతుంది.
బ్యాంకాక్‌ కేంద్రంగా పని చేస్తున్న ఏపీఏఏఆర్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ డాక్టర్‌ రవి ఖెతార్‌ పాల్‌ ఈ సందర్భంగా మాట్లా డుతూ, “జీన్‌ ఎడిటింగ్‌ అనేది అధునాతన బ్రీడింగ్‌ ఉపకరణం. మెరుగుపర్చబడిన లక్షణాలను పొందేందుకు జన్యువుల్లో అవసరమైన మార్పులు చేసేందుకు బ్రీడర్‌ కు ఇది వీలు కల్పిస్తుంది. వేరియేషన్స్‌ ఉత్పత్తి చేసేందుకు, స్క్రీన్‌ చేసేందుకు మ్యుటాజెనిసిస్‌ (మ్యుటేషన్స్‌ ను ఉత్పత్తి చేయడం), మాలిక్యులర్‌ ఉపకరణాలు ఉన్నప్పటికీ, ఎన్నో బ్యాక్‌ క్రాసింగ్‌ మరి యు ఎంతో సమయం, శ్రమ అవసరమయ్యే సెలెక్షన్‌ అనేవి బ్రీడింగ్‌ లో తప్పనిసరిగా ఉన్నాయి. విస్తృత స్థాయి బ్యాక్‌ క్రా సింగ్‌, సెలెక్షన్‌ ల అవసరం ఏమాత్రం లేకుండానే ప్లాంట్‌ వెరైటీలో మెరుగుపర్చబడిన లక్షణాన్ని జీన్‌ ఎడిటింగ్‌ జనరేట్‌ చే యగలుగుతుంది. జీన్‌ ఎడిటెడ్‌ ప్లాంట్స్‌ లో అనేకమైన వాటిలో ఏవిధమైన బయటి జన్యువులు జొప్పించబడలేదు మ రియు సంప్రదాయక బ్రీడ్‌ ప్లాంట్స్‌ మాదిరిగానే ఉంటాయి. అందుకే అమెరికా, కెనడా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, జపాన్‌, రష్యా వంటి దేశాలేవీ కూడా వాటిని నియంత్రించడం లేదు. నియంత్రణ పరిధికి వెలుపల ఉంచడం ఈ సాంకేతికతను చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, సంస్థలకు అందుబాటులో ఉండేలా చేసింది మరియు వినూత్నతను పెంచిపోషించేలా చేసింది.
మ్యుటాజెనిసిస్‌, సంప్రదాయక బ్రీడింగ్‌ రెండూ కూడా, తరాలు గడిచే కొద్దీ చోటు చేసుకునే కొన్ని అనుద్దేశపూర్వక మా ర్పులను కలిగిఉంటాయి. ఈ ప్రాసెస్‌ నిర్దిష్టికత మరియు కచ్చితత్వం కారణంగా జీన్‌ ఎడిటెడ్‌ ప్లాంట్స్‌ లో మాత్రం ఈ విధమైన అనుద్దేశపూర్వక మార్పులు చాలా తక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేనంత స్థాయిలో ఉం టాయి. వాటిని కూడా గుర్తించి, సెలెక్షన్‌ లో నుంచి తప్పించి మెరుగుపర్చబడిన లక్షణాన్ని మాత్రమే ఉంచుకునే అవకాశం కూడా ఉంది.
మొట్టమొదటి జీన్‌ ఎడిటెడ్‌ పంట ‘లో శాచురేటెడ్‌ అండ్‌ జీరో ట్రాన్స్‌ ఫ్యాట్‌’ సోయాబీన్‌ 2019లో వాణిజ్యీకరణ చేయ బడింది. మరెన్నో ఎడిటెడ్‌ క్రాప్స్‌ రానున్నాయి. వాక్సీ కార్న్‌, నాన్‌ బ్రౌనింగ్‌ మష్‌ రూమ్స్‌, యాపిల్స్‌, కరువును తట్టు కునే వరి, వ్యాధులను తట్టుకునే గోధుమ, వేగంగా పుష్పించే టమాటలు, కలుపునివారిణి నిరోధక వరి, కసావా, మెరుగు పర్చబడిన ప్రాసెసింగ్‌ లక్షణాలతో ఆలుగడ్డ, లో గ్లూటెన్‌ గోధుమ లాంటివి వీటిలో ఉన్నాయి. మెరుగుపర్చబడిన పోషక గుణాలు, నూతన రుచులు, అలెర్జీ కారకాల స్థాయిని తగ్గించడం, వ్యాధులను తట్టుకునే మరియు నిల్వ కాలం (షెల్ఫ్‌ లైఫ్‌) అధికంగా ఉండడం లాంటివి ఈ సాంకేతికత అందించే ప్రయోజనాల్లో ఉన్నాయి.
బ్రీడర్లకు జీన్‌ ఎడిటింగ్‌ అనేది టూల్‌ ఆఫ్‌ ఛాయిస్‌ కానుందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అది జనెటిక్‌ వేరియబిలిటీని సమర్థంగా వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తుంది. జీన్‌ ఎడిటింగ్‌ క్రాప్స్‌ వల్ల కలిగే ప్రయోజనాలు, ని యంత్రణ లేకపోవడం / తక్కువ నియంత్రణ అనేవి నిర్లక్ష్యానికి గురై చిన్న చిన్న మార్కెట్‌ లను కలిగి ఉండే ఎన్నో ప్రాం తీయ పంటలకు ఎడిటింగ్‌ ను టూల్‌ ఆఫ్‌ చాయిస్‌ గా చేస్తున్నాయి. మరో వైపున అధిక వ్యయాలతో కూడిన అధిక ని యంత్రణ అనేది పండ్ల తోటలతో సహా అనేక చిన్న పంటలకు కూడా జీన్‌ ఎడిటింగ్‌ ను అనువైందిగా చేస్తోంది.
ఆసియా దేశాల్లో భారత్‌ ప్రస్తుతం జీన్‌ ఎడిటెడ్‌ ఆర్గానిజమ్స్‌ ను నియంత్రించేందుకు మార్గదర్శకాలను రూపొంది స్తోంది. దక్షిణాసియ ప్రాంతంలో భారతదేశం నాయకత్వ పాత్రను పోషిస్తోంది. ఇతర దేశాలు సైతం అదే విధమైన జీన్‌ ఎడిటింగ్‌ నియంత్రణలను అనుసరించే అవకాశం ఉంది. అందుకే భారతదేశం ఈ సాంకేతికత అందించే ప్రయోజనాలకు మరింత ప్రా ధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. నియంత్రణ అనేది సహేతుకంగా, శాస్త్రీయ విధానంలో ఉండాలి. తద్వారా సాంకేతికత మరియు వినూత్నతకు అనుసంధానతను కలిగిఉండడంలో ఆంక్షలు విధించే ఉండకూడదు. వ్యాపారం చేసే దేశాల మధ్య నియంత్రణల్లో నిలకడ లేకపోవడం అనేది వ్యవసాయో త్పత్తుల వాణిజ్యాన్ని దెబ్బ తీస్తుంది మరియు వ్యవసాయ రంగం వృద్ధి పై ప్రతికూల ప్రభావాన్ని కనబరుస్తుంది. దేశం, రీజియన్‌ యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భారతదేశం జీన్‌ ఎడిటెడ్‌ క్రాప్స్‌ కు సంబంధించి నిలకడతో కూడిన సైన్స్‌ ఆధారిత విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. చిన్న, మధ్య తరహా ఎంట్రప్రెన్యుయర్ల సమీకృత వృద్ధికి తోడ్పడేలా, విస్తృత స్థాయి పంటలను కలిగిఉంటూ, సుస్థిరదాయక విధానంలో రైతులకు మరియు వినియోగదారులకు ప్రయోజనం అందించేలా ఉండాలి.
డాక్టర్‌ రవి ఖెతార్‌ పాల్‌,
ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ ఏపీఏఏఆర్‌ఐ.

DO YOU LIKE THIS ARTICLE?