ఎథిలిన్ అమ్మకాలపై వివరణివ్వండి!
మీడియాఫైల్స్/హైదరాబాద్ : ఎథిలిన్ అమ్మకాలకు అనుమతి ఉన్న నిబంధనలు గురించి వివరించాలని తెలంగాణ
ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎథిలిన్ అమ్మకాలు చేస్తున్న
వ్యాపారులు, డీలర్లపై అధికారులు కేసులు పెడుతున్నారని నాగపూర్‌కు చెందిన
ఎస్జీఎస్ ఇంటర్నేషనల్ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మంగళవారం
హైకోర్టు విచారించింది. ఎథిలిన్కు బదులుగా ఎన్ రైప్ అనే దానిని
వాడలంటూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఎథిలిన్ వినియోగంపై గత ఏడాది
నవంబర్‌లో సర్కార్ ఇచ్చిన మెమోలోని సారాంశానికి విరుద్ధంగా పోలీసులు
కేసులు పెడుతున్నారని పిటిషనర్ వాదనపై విచారణ వాయిదా పడింది.