నాల్గవ కరోనా మరణం
న్యూఢిల్లీ : భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య 173కి పెరిగింది. అందులో 25 మంది విదేశీయులే. ఇప్పటివరకు నాలుగు మరణాలు సంభవించాయి. ఢిల్లీ, కర్నాటక, పంజాబ్, మహారాష్ట్రలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నాడు నాల్గవ మృతి నమోదైనట్లు కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.