కరోనా ఎఫెక్ట్ చిన్నారులకు ఉండదా?
శ్రీకాకుళం: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా ప్రభావంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అన్ని విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, కాలేజీలు, యూనివర్సిటీలు సెలవు ప్రకటించాయి. అయితే దేశంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం ఇంత వరకు జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఎలర్ట్ ప్రకటించిన అంగనవాడి కేంద్రాల విషయంలో ఇటువంటి ప్రకటనలు చేయకపోవడం అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. చిన్నారులను కాపాడుకోవడంలో భయాందోళన చెందుతున్నారు. కేంద్రాలకు సెలవు ఇవ్వాలా వద్దా అని, సతమతమవుతున్నారు. అధికారులు ఆకస్మిక తనిఖీలు ఉంటాయని భయం చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో అంగన్వాడీ కేంద్రాలను తెరిచి ఉంచడం చిన్నారుల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కావున చిన్నారులను రక్షించుకునేందుకు ప్రభుత్వాలు అంగన్వాడీ సెంటర్లకు కు సెలవులు ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలి.