భారత్‌లో 249కి పెరిగిన కరోనా కేసులు

న్యూఢిల్లీ : భారత దేశంలో కరోనా వైరస్‌ గొప్పగా కాకపోయినా, ప్రమాదకరంగానే పరుగులు పెడుతోంది. సహజంగానే మన దేశంలో శుచిశుభ్రత అనేది సాంప్రదాయ లక్షణాలు కావడంతో కరోనా అంత వేగంగా వ్యాప్తి చెందడం లేదు. అయినప్పటికీ, శుక్రవారంనాటికి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 249కి చేరింది. కేరళలో మరో 12 కేసులు నమోదయ్యాయి. కొచ్చిలో బ్రిటన్‌ నుంచి వచ్చిన ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. వీరిని క్వారంటైన్‌కు తరలించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 52 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మన దేశంలో నలుగురు కరోనా కారణంగా మరణించారు.

DO YOU LIKE THIS ARTICLE?