భారత్ లో 944కి చేరిన‌ కరోనా కేసులు

న్యూఢిల్లీ : భార‌త‌దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ -19 కారణంగా దేశంలో ఇప్పటివరకు మొత్తం 20 మంది మృతి చెందారు. వైరస్ సోకిన మొత్తం బాధితుల్లో 84 మంది కోలుకోగా ప్రస్తుతం 775 మంది చికిత్స పొందుతున్నారు. కొత్త‌గా 57 కేసులు న‌మోదయ్యాయి. ఇప్పటికే ఈ మహమ్మారి దాదాపు అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. తెలంగాణలోనే ఇప్పటివరకు 59కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొవిడ్ -19 తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ కరోనా కారణంగా నలుగురు మరణిచంగా గుజరాత్ లో ముగ్గురు మరణించారు. కర్ణాటకలో ఇద్దరు మరణించగా కేరళలో దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏపీలో 13 మందికి కరోనా పాజిటివ్ గా గుర్తించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

DO YOU LIKE THIS ARTICLE?