షెల్ట‌ర్ హోమ్స్‌లో క‌రోనా వ్యాప్తి ఉండ‌దా?

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చే సే వాళ్లపై కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు రాసిన లేఖకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలంటూ అందిన లేఖను హైకోర్టు పిల్‌గా తీసుకుంది. హైదరాబాద్‌కు చెందిన లాయర్‌ కైలాస్‌నాథ్‌ రాసిన లేఖను పిల్‌గా తీసుకుంది.  హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో వివిధ కారణాల వల్ల చిక్కుకుపోయిన వాళ్ల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్‌ హోమ్స్‌లో నివాసం ఉండే వారికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ మరో లాయర్‌ వసుధా నాగరాజ్‌ రాసిన లేఖను కూడా హైకోర్టు పిల్‌గా తీసుకుంది. ఈ రెండు పిల్స్‌ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ విచారించనుంది. హోంల్లో సగటున రెండు వందల పైచిలుకు మంది ఉన్నారని, వీరిలో వివిధ సమస్యలతో బాధపడే వాళ్లూ ఉన్నారని, పురుడుపోసుకున్న తల్లులు, పిల్లలు, బిచ్చగాళ్లు, వీధి బాలలు, నిరాశ్రయులు, వలస కార్మికులు, రోగులు, వైద్యం చేయించుకుని ఇళ్లకు వెళ్లాల్సిన వాళ్లంతా ఉన్నారని తెలిపారు. వీరంతా నేలపైనే ఉండాలంటే రోగులు, పిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు చాలా కష్టంగా ఉందన్నారు. ఒకే చోట అంతమంది ఉండటం వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశాలు ఉన్నాయని, కరోనా వైద్య పరీక్షలు చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. వైద్యం చేసే వాళ్లకు హాస్పటల్స్, వాండ్ల ఇండ్ల వద్ద భద్రత, రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రెండు లేఖలను హైకోర్టు బుధవారం విచారించే అవకాశం ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?