అమెరికాలో కరోనాకు స్పీడెక్కువ!

వాషింగ్టన్‌ : అమెరికాలో కరోనా వైరస్‌ అత్యంత వేగంగా ప్రయాణిస్తోంది. ఈ వైరస్‌ చైనాలో పుట్టిందని చెపుతున్నప్పటికీ, నిబద్ధతతో ఆ దేశం ఈ మహమ్మారిని నియంత్రిస్తోంది. కానీ అమెరికాలో మాత్రం కొవిడ్‌ 19 అదుపుతప్పి పరుగులు తీస్తోంది. మే 1వ తేదీన అమెరికాలో కేవలం 75 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 16,067కు చేరింది. అంటే కేవలం 15 రోజుల్లో వందల రెట్లు అధికంగా ఈ వైరస్‌ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,65,867 మందికి కరోనా వైరస్‌ సోకింది. వారిలో 11 వేల మందికిపైగా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ, ఇరాన్‌ దేశాల తర్వాత ఈ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దేశాల్లో అమెరికా కూడా నిలిచింది. ఇదే విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారంనాడు సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించారు.

DO YOU LIKE THIS ARTICLE?