ఆర్థిక లావాదేవీలే కార‌ణమా? హైదరాబాద్ వ్యాపారి హత్యపై ద‌ర్యాప్తు!

ఆర్థిక లావాదేవీలే కార‌ణమా? హైదరాబాద్ వ్యాపారి హత్యపై ద‌ర్యాప్తు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లో వ్యాపారి మ‌ధుసూద‌న్‌రెడ్డి కిడ్నాప్‌, హ‌త్య‌పై వివిధ కోణాల్లో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో ప్ర‌ధాన అంశాలు :

 • సంగారెడ్డి జిల్లా కొహీర్ మండలం దిగ్వాల్ గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన శవాన్ని వెలికి తీసిన పోలీసులు
 • కర్మన్ ఘాట్ లో నివాసముండే మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..
 • పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడంతో మధుసూదన్ రెడ్డి హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది..
 • కిడ్నాప్ & హత్యా కేసులో జగన్ నాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సౌత్ జోన్ పోలీసులు..
 • ఈ నెల 19 చార్మినార్ లోని సంజీవ్ ఇంటికి వచ్చిన మధుసూదన్ రెడ్డి..
 • సంజీవ్ ఇంటి నుండి కార్లో సంగారెడ్డి వెళ్లిన మధుసూదన్ రెడ్డి, సంజీవ్, గిరీష్, జగన్ నాథ్..
 • మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులకు మధుసూదన్ కిడ్నాప్ చేశామని సమాచారం ఇచ్చిన జగన్నాథ అనే వ్యక్తి..
 • సంజీవ్, గిరీష్ ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు..
 • డబ్బుల విషయంలో మధుసూదన్ రెడ్డి ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సంజీవ్
 • పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్న సౌత్ జోన్ పోలీసులు…
 • ఆర్థిక లావాదేవీల్లో కారణంగా
  మధుసూదన్ రెడ్డి ని హతమార్చిన సంజీవ్
 • 40 లక్షల వివాదంలో
  గతంలో ఒక్కరిని హత్య చేసి జైలుకు వెళ్లిన మధుసూదన్ రెడ్డి.
 • జైల్లో పరిచయమైన కర్ణాటక కు చెందిన సంజీవ్
 • జైలు నిండి విడుదల అనంతరం ఇద్దరు కలిసి హైదరాబాద్ లో వ్యాపారం
 • మధుసూదన్ రెడ్డి కి
  40 లక్షలు బాకీ పడ్డ
  సంజీవ్.
 • 19 నాడు డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పి మధు సుధన్ రెడ్డిని హత్య చేసిన సంజీవు
 • మధు సుధన్ రెడ్డి డెడ్ బాడీని పాతి పెట్టి ఆనవాళ్లు లేకుండా చేసిన సంజీవ్
 • 20 నాడు కుటుంబీకుల పిర్యాదు తో రంగంలొకి దిగిన పోలీసులు.
 • ఫోన్ కాల్ డాటా ఆధారంగా డ్రైవర్ జగన్నాథ్ ను అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు.
 • మ‌ధుసూద‌న్‌రెడ్డి కిడ్నాప్‌, హ‌త్య‌పై వివిధ కోణాల్లో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
DO YOU LIKE THIS ARTICLE?