టిడిపి నేత‌ల‌పై దాడి

మీడియాఫైల్స్‌/అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ ప‌రిస్థితులు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. పాల‌క‌, ప్ర‌తిప‌క్షాల న‌డుమ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు, ఘ‌ర్ష‌ణ వైఖ‌రులు పెరుగుతున్నాయి. తాజాగా మాచ‌ర్ల‌లో ఇరు పార్టీల మ‌ధ్య తీవ్ర‌మైన ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. ఒక పంచాయ‌తీని సంద‌ర్శించేందుకు వెళ్లిన టిడిపి నాయ‌కులు బొండో ఉమామ‌హేశ్వ‌ర‌రావు, బుద్దా వెంక‌న్న‌ల‌పై వైఎస్ఆర్‌సిపి కార్య‌క‌ర్త‌లుగా అనుమానిస్తున్న వ్య‌క్తులు దాడులు చేశారు. బుధ‌వారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఈ ప్రాంతంలో తీవ్ర భ‌యోందోళ‌న‌ను సృష్టించింది. ఒక వ్య‌క్తి ఏకంగా పెద్ద ఇనుప‌రాడ్డు, దుడ్డుక‌ర్ర‌లతో కారుపై చేసిన దాడి సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. టిడిపి నేత‌ల వాహ‌నాలు ఇక్క‌డ ప్ర‌వేశించ‌గానే వ్య‌తిరేక వ‌ర్గీయులు రాడ్లు, క‌ర్ర‌ల‌తో దాడికి దిగారు. డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో వెంక‌న్న‌, బోండాలు తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నారు. ఒక అడ్వ‌కేట్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఊహించ‌ని ఈ ఘ‌ట‌న టిడిపిని షాక్‌కు గురిచేసింది. ఈ ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు నిర‌స‌న తెలియ‌జేశారు. కాగా ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులుగా అనుమానిస్తున్న వ్య‌క్తుల‌ను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. అయితే వారు ఏ పార్టీకి చెందిన వార‌న్న‌ది తెలియ‌జేయ‌లేదు.

DO YOU LIKE THIS ARTICLE?