హుందాగా నిష్క్రమించిన దేవి నాగవళ్లి

మీడియాఫైల్స్/హైదరాబాద్ డిజిటల్ : స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘బిగ్ సీజన్ 4’ రోజురోజుకీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈసారి అనూహ్యమైన రీతిలో న్యూస్ యాంకర్, రిపోర్టర్ దేవి నాగవళ్లి బిగ్ నుంచి ఎలిమినేషన్ అయింది. నిజానికి బిగ్ హౌస్ పెద్దగా ప్రభావం చూపని కుమార్ ఎలిమినేషన్ తప్పదని మొదట్లో అంతా భావించారు. కానీ అనూహ్యంగా దేవి నాగవళ్లి ఎలిమినేట్ అయింది. గత వారం ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి తన బిగ్ ఉపయోగించి, దేవి నాగవళ్లిని నామినేషన్ నెట్టేసింది. అయినప్పటికీ బిగ్ హౌస్ ఏ వ్యవహారంలోనై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, డేరింగ్ మాట్లాడే దేవి నాగవళ్లిని అంత సులువుగా ప్రేక్షకులు ఎలిమినేట్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. వాస్తవానికి దేవి నాగవళ్లి నిష్క్రమణ ఇంటి సభ్యులను పూర్తిగా కంటతడి పెట్టించింది. ఆమెకు వీరాభిమానిగా మారిన ఆరియానా ఏడుపుకైతే అంతం లేకుండా పోయింది. కాకపోతే దేవి నాగవళ్లి ఎంతో హుందాగా బయటకు రావడం విశేషం. ఆమె నిజంగానే ఒక ఫైటర్ ఐరన్ లేడీలా నిష్క్రమించింది. ఆమె వెళ్తూవెళ్తూ సభ్యులెవ్వర్నీ కించపర్చకుండా, అందరి విషయాల్లోనూ ఎంత పాజిటివ్ స్కోరింగ్ ఇస్తూ, బిగ్ పాజిటివ్ ఆరియాన్ సేవ్ చేసి మరీ బిగ్ వెళ్లిపోయింది. దేవి నాగవళ్లి ఉన్నది మూడు వారాలైనా, నిజమైన జర్నలిస్టులా, స్ట్రాంగ్ వుమన్ వ్యవహరించి ప్రశంసలు పొందింది.

DO YOU LIKE THIS ARTICLE?