ఆ వార్త‌ల‌న్నీ అవాస్త‌వం : అనుష్క‌

మీడియాఫైల్స్‌ ; త‌న పెళ్లిపై వ‌చ్చిన వ‌దంతుల్లో ఎలాంటి నిజం లేద‌ని స్వీటీ అనుష్క శెట్టి పేర్కొంది. టాలీవుడ్‌కు చెందిన ఒక ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కుమారుడితో త‌న వివాహం జ‌ర‌గ‌బోతున్న‌ద‌ని వ‌చ్చిన వార్త‌ల‌ను అనుష్క ఖండించింది. పెళ్లిపై తాను దాచ‌డానికి ఏమీ లేద‌ని, ఇలాంటి విష‌యాలు దాస్తే దాగ‌వ‌ని తెలిపింది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చి 15 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా అనుష్క ఒక మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు విష‌యాలు తెలిపారు. త‌న వ్య‌క్తిగత విష‌యాల్లోకి ఎవ‌రూ చొర‌బ‌డ‌వ‌ద్ద‌ని, పెళ్లి అనేది ప‌విత్ర‌మైన అంశ‌మ‌ని గుర్తించాల‌ని పేర్కొంది.

DO YOU LIKE THIS ARTICLE?