తెలంగాణలో మరో 3 కరోనా కేసులు
రాష్ట్రంలో 16కి చేరిన కొవిడ్ 19 కేసుల సంఖ్య
మీడియాఫైల్స్/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఎన్ని చర్యలు చేపతున్నప్పటికీ, కరోనా తన దూకుడు ప్రదర్శిస్తూనే వుంది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి 10 గంటలకు రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో ఈ విషయం వెల్లడించారు. ఈ ముగ్గురూ విదేశాల నుంచి వచ్చినవారే, ఒకరు దుబాయి నుంచి హైదరాబాద్కు, మరో ఇద్దరు లండన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన కరోనా బాధితులు. వారిలో కొవిడ్ 19 వ్యాధి లక్షణాలు కన్పించగానే ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో కొవిడ్ 19 పాజిటివ్ ఉన్నట్లు బయటపడింది. వారికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16కి పెరిగింది.