64 దేశాలకు అమెరికా సాయం!
వాషింగ్టన్ : కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అగ్రరాజ్యం అమెరికా విఫలమైనప్పటికీ, ఇతర దేశాలకు ఆర్థిక సాయం అందించడానికి ఆ దేశం ముందుకొచ్చింది. కరోనాను నియంత్రించడంలో అమెరికాకే సాధ్యం కానప్పుడు ఇతర దేశాలకు ఇదెలా సాధ్యమవుతుందని భావించిన ఆ దేశం వివిధ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. 64 దేశాలకు 174 మిలియన్ డాలర్ల నిధులను అందజేయనున్నట్లు తెలిపింది. అందులో భాగంగా భారత్ 2.9 మిలియన్ డాలర్లు కేటాయించారు. ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఇది అదనం. అమెరికా ప్రజలపై చూపుతున్న ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం అనేక ఉద్దీపన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కరోనా వల్ల అత్యధిక స్థాయిలో ప్రభావితం అయిన 64 దేశాలకూ సాయం ప్రకటించారు. భారత్ కు ఇచ్చిన నిధులతో ల్యాబోరేటరీ వ్యవస్థలు, కరోనా సోకిన వ్యక్తుల గుర్తింపు, బాధితులపై నిరంతర పర్యవేక్షణ, ఇతర సాంకేతికత సదుపాయాలను సమకూర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు లక్ష కేసులు దాటిన కరోనా అమెరికా ఈ విషయంలోనూ అగ్రరాజ్యంగా నిలిచింది.