30న పరిగెత్తు పరిగెత్తు

*’పరిగెత్తు పరిగెత్తు’ హీరోగా కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నా – యంగ్ హీరో సూర్య శ్రీనివాస్*
ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’  తప్పక విజయం సాధిస్తుందని  యంగ్ హీరో సూర్య శ్రీనివాస్ చెప్పారు.
 ఓటీటీ ,సిల్వర్ స్క్రీన్ మీద మంచి పాత్రలు చేసి తన ప్రతిభ చూపిన సూర్య శ్రీనివాస్  ఈ సినిమా లో ఫుల్ లెంగ్త్ హీరో గా నటించాడు.
“మహానటి” చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ లో , “ఎన్టీఆర్ బయోపిక్” లో జయకృష్ణ  “ కుడి ఏడమైతే” సిరీస్ లో si తిలక్ పాత్రలో నటించిన సూర్య శ్రీనివాస్ కు ఆ పాత్రలు నటుడిగా గుర్తింపు తీసుకొచ్చాయి.
ఈ నెల 30న  ‘పరిగెత్తు పరిగెత్తు’ సినిమా థియేటర్ లలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు కమిట్ మెంట్ అనే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది
*సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ*..’పరిగెత్తు పరిగెత్తు’ మూవీ ఈ నెల 30న థియేటర్ లలో మీ ముందుకొస్తోంది. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. నటుడిగా నాకు పర్మార్మెన్స్ కు బాగా స్కోప్ దొరికింది. ‘పరిగెత్తు పరిగెత్తు’ హీరోగా ఓ బిగ్ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం కమిట్ మెంట్, టాక్సీ 911, చిల్ బ్రో, జమానా సినిమాల్లో నటిస్తున్నాను. ఈ సినిమాలు కూడా వీలైనంత త్వరగా రిలీజ్ కాబోతున్నాయి. ఈ వరుస సినిమాలతో హీరోగా సెటిల్ అవుతానని నమ్మకం ఉంది అన్నారు.
DO YOU LIKE THIS ARTICLE?