“సొగసు చూడ తరమా” సినిమా మొదటి గ్లిమ్ప్స్ విడుదల

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, క్రియేటివ్ థింగ్స్ గ్యాంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ” సొగసు చూడ తరమా”.
తల్లాడ సాయి కృష్ణ నక్షత్ర హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా లో మొదటి గ్లిమ్ప్స్ ని మంగళవారం నాడు విడుదల చేసారు.

హీరోయిన్ నక్షత్ర బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ గ్లిమ్ప్స్ లో అరకు లో ఉన్న అందాలలో హీరోయిన్ ఉన్న సన్నివేశాలు చూపిస్తూ, చక్కటి నేపధ్య సంగీతాన్ని వినిపిస్తూ ప్రేక్షకుల మనసుల్ని ఈ టీజర్ దోచుకుంటుంది అని డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ అన్నారు.

హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ నేను చేసిన రెండవ సినిమా ఇది, అరకు లో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది,సొగసు చూడ తరమా లో నా పాత్ర చాలా బాగుంటుంది,
ఈ రోజు రిలీజ్ ఐనా  గ్లిమ్ప్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమా కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్- అశోక్ నిమ్మల, గౌతమ్, విజయ్ నిట్టాల,
క్రియేటివ్ హెడ్- వివేకానంద విక్రాంత్,
రచన – శివ కాకు,
కెమేరా -శివ రాథోడ్, సంగీతం- పవన్, నిర్మాత- తల్లాడ శ్రీనివాస్,
డైరెక్టర్- తల్లాడ సాయికృష్ణ,
పి.ఆర్.ఓ- పవన్ పాల్.

DO YOU LIKE THIS ARTICLE?