మెహ‌బూబ్ గుంటూరు మిర్చి వెబ్ సిరీస్ టీజ‌ర్ విడుద‌ల‌

ఇన్ఫినిటిమ్ నెట‌వ‌ర్క్ సొల్యూష‌న్స్ బ్యాన‌ర్ పై బిగ్ బాస్ ఫేమ్ మెహ‌బూబ్ హీరోగా గుంటూరు మిర్చి వెబ్ సిరీస్ టీజ‌ర్ విడుద‌ల‌, అనూహ్య స్పంద‌న‌


యూట్యూబ్ వేదికిగా వెబ్ సిరీస్ విభాగంలో ప‌లు బ్లాక్ బస్ట‌ర్స్ సిరీస్ లు ప్రేక్ష‌కుల‌కి అందిస్తున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఇన్ఫినిట‌మ్ నెట‌వ‌ర్క్ సొల్యూష‌న్స్ వారు బిగ్ బాస్ ఫేమ్, స్టార్ సోష‌ల్ మీడియా ఇన్ఫూలెన్స‌ర్ మెహ‌బూబ్ హీరోగా ఫుల్ గుంటూరు మిర్చి అనే వెబ్ సిరీస్ ని నిర్మించారు. జూలై 29న మెహబూబ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ వెబ్ సిరీస్ టీజ‌ర్ విడుదలైంది. ఫీచ‌ర్ ఫిల్మ్ కి ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిన ఫుల్ మాస్ అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సిరీస్ ని రూపొందించారు. టీజ‌ర్ లో మెహ‌బూబ్ లుక్స్ కి, ఇన్ఫినిటిమ్ వారి ప్రొడ‌క్ష‌న్ వాల్యూకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. యూత్ తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించే రీతిన ఈ టీజ‌ర్ ఉంది, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్లుగా ప్ర‌ణ‌వి మానుకొండ‌, రితిక చక్ర‌బ‌ర్తి న‌టిస్తున్నారు. ఈ సిరీస్ కి ద‌ర్శ‌కుడుగా డాక్ట‌ర్ అనిల్ విశ్వ‌నాథ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు, క‌థ‌ను ఎస్.డి.చ‌ద్ధా అందించారు. అతి త్వ‌ర‌లో ఈ సిరీస్ కి సంబంధించిన విడుద‌ల తేది త‌దిత‌ర వివ‌రాలు అధికారికంగా విడుద‌ల కానున్నాయి

తారాగ‌ణం – మెహ‌బూబ్, ప్ర‌ణ‌వి మానుకొండ‌, రితిక చ‌క్ర‌బ‌ర్తి

సాంకేతిక వ‌ర్గం

క‌థ – ఎస్.డి చ‌ద్దా

డైర‌క్ట‌ర్ – డాక్ట‌ర్ అనిల్ విశ్వ‌నాథ్

నిర్మాణం – ఇన్ఫినిట‌మ్ నెట‌వ‌ర్క్ సొల్యూష‌న్స్

కో డైరెక్ట‌ర్ – కామాక్షి భాస్క‌ర‌ల‌

మ్యూజిక్ – శ్ర‌వణ్ భ‌ర‌ద్వాజ్

డిఓపి – దినేశ్ ప‌ర్చూరి

ఎడిటిర్ – డి శివ సాయితేజ‌

పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

ప‌బ్లిసిటీ డిజైన‌ర్ – డిజైన్ మంచు

లైన్ ప్రొడ్యూస‌ర్ – గిరీష్ రెడ్డి

DO YOU LIKE THIS ARTICLE?