ముస్లింలను రెచ్చగొడుతున్న విపక్షాలు: లక్ష్మణ్‌

ప్రధాని మోదీని ఎదుర్కోలేక, నానాటికి పెరుగుతున్న ఆదరణ చూడలేక.. సీఏఏకు విపక్షాలు మతం రంగు పులుముతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం సామాజికవర్గాన్ని రెచ్చగొడు తున్నాయని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సీఏఏపై నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని అదృశ్యశక్తులు ఢిల్లీలో అల్లర్లు సృష్టించాయన్నారు. భారత్‌లో ముస్లింలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొంటూ, 52 దేశాల్లో వారికి లేని స్వేచ్ఛ ఇక్కడ ఉందని చెప్పారు. అంతకుముందు అమిత్‌షా పర్యటన ఏర్పాట్లపై ముఖ్యనేతలతో ఆయన సమీక్షించారు.

DO YOU LIKE THIS ARTICLE?