కాల్స్‌ నాణ్యతలో రాజీలేదు: ట్రాయ్‌

పుణె/న్యూఢిల్లీ: ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ ఇవ్వడమే ఫోన్‌ కాల్స్‌లో నాణ్యత లేకపోవ టానికి కారణమని టెలికాం సంస్థలు చెప్ప డం సరికాదని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ స్పష్టం చేశారు. ఆ సమాధానం ట్రాయ్‌ నిబంధనల్ని సమాధానపరచలేదని, ఫోన్‌ కాల్స్‌లో నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాల్‌ డ్రాప్స్‌పై ట్రా య్‌ విధించిన నిబంధన విషయంలో సుప్రీంకోర్టు తమకు ప్రతికూల తీర్పు ఇచ్చినప్పటికీ.. సేవల నాణ్యతను పెంచేందుకు చేసే ప్రయత్నాలు ఆగవని పేర్కొన్నారు. గత కొంతకాలంగా.. దాదాపు అన్ని నెట్‌వర్క్‌లకు సంబంధించిన వినియోగదారులు కాల్స్‌ నాణ్యత విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

DO YOU LIKE THIS ARTICLE?